కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట డివిజన్లోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో ఉన్న మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ముఖం కుళ్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. మృతదేహం తేలిన చోట ఒడ్డుపై బట్టల సంచి, చెప్పులు ఉన్నాయి. అందులో రోజూ ధరించే దుస్తువులు, స్వెటర్, మాత్రలు, కొబ్బరి నూనె, టూత్ బ్రష్ ఉన్నాయి.
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం - గుర్తు తెలియని మృతదేహం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని పెద్ద చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం Unknown Dead body Found In Ellareddy Pind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8883269-552-8883269-1600687360804.jpg)
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం!
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడం వల్ల పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. వివరాలు ఏమీ తెలియక పోవడం వల్ల గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. మృతురాలి ఒంటిపై పసుపు రంగు జాకెట్, ఆకుపచ్చ కలర్ చీర ఉంది. మృతురాలి సమాచారం తెలిసిన వారు.. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో సంప్రదించాల్సిందిగా పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి:శ్రీశైలం ప్రమాదంపై లోతుగా సీఐడీ విచారణ