మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం నీట మునిగింది. కాగా పలువురు గల్లంతయ్యారు. గురువారం హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని సింగరేణి పార్కు వద్ద వరదనీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
సైబరాబాద్ వద్ద వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - సైబరాబాద్ వదరనీటిలో గుర్తతెలియన మృతదేహం
ఇటీవలే హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు పలువురు గల్లంతయ్యారు. కాగా గురువారం సైబరాబాద్ పరిధిలోని సింగరేణి పార్కు వద్దకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వరదనీటికి కొట్టుకొచ్చింది.
![సైబరాబాద్ వద్ద వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం unknown dead body found at cyberabad flood water in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9184433-104-9184433-1602759490541.jpg)
సైబరాబాద్ వద్ద వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని శవాన్ని జేసీబీ సహాయంతో బయటకు తీశారు. మృతుడు మాదన్నపేట కుర్మగూడ త్రీటెంపుల్ ప్రాంతానికి చెందిన ఎండీ అహ్పస్ ఉల్లాఖాన్గా అనుమానిస్తున్నారు.