వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్త తండా శివారులో గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఓ రైతు పొలంలో మృతదేహం కనిపించగా... పోలీసులకు సమాచారం అందించారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య గల యువతిని వారం క్రితం హతమార్చినట్లు డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.
యువతి శరీరంపై బ్లూ కలర్ జీన్స్ పాయింట్ మాత్రమే ఉందని చెప్పారు. ఆనవాళ్లను బట్టి మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల పోలీస్ స్టేషన్ లో ఏవైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా అనే సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు.