తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి - unknown people attack on fastfood center

చిక్కడపల్లి పీఎస్​ పరిధిలోని ఆజామాబాద్​లో గల ఓ ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

unidentified-men-attack-a-fast-food-center-in-hyderabad
ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

By

Published : Oct 1, 2020, 12:06 PM IST

ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజామాబాద్​లో స్పైస్ ఫాస్ట్ పుడ్ సెంటర్​పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ముఖాలకు మాస్కులు ధరించి నిర్వాహకులపై కర్రలతో, ఇనుప కడ్డీలతో ఒక్కసారిగా దాడి చేశారు. సీసీ కెమెరాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. భయాందోళనలకు గురైన నిర్వాహకులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇవీ చూడండి: ఏటీఎంలలో నగదు నింపకుండా కాజేస్తున్న ఇద్దరి అరెస్ట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details