తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నారాయణగూడ మెట్రోస్టేషన్​ కింద గుర్తుతెలియని వ్యక్తి హత్య - నారాయణగూడలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

హైదరాబాద్​ నారాయణగూడ మెట్రోస్టేషన్​ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా... ఘటనాస్థలికి చేరుకుని క్లూస్​ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

నారాయణగూడ మెట్రోస్టేషన్​ కింద గుర్తుతెలియని వ్యక్తి హత్య
నారాయణగూడ మెట్రోస్టేషన్​ కింద గుర్తుతెలియని వ్యక్తి హత్య

By

Published : Nov 14, 2020, 7:27 PM IST

హైదరాబాద్ నారాయణగూడ మెట్రోస్టేషన్ కింద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కంట్రోల్ రూమ్​కు మెట్రో ప్రయాణికులు సమాచారం ఇవ్వగా... ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

మద్యం మత్తులో ఇద్దరు వైట్నర్​ సేవించే వారి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ గొడవలో ఓ వ్యక్తి మరోకరి తలపై బండరాయితో కొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: గోదావరి ఒడ్డున పార్టీ.. ఈతకు దిగి నలుగురు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details