కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో.. మురికి కాలువలో మహిళ మృతదేహం కలకలం రేపింది. గురువారం రాత్రి అటువైవు వెళ్తున్న స్థానికులు మృతదేహం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... పురపాలక సిబ్బందితో మృతదేహాన్ని కాల్వలోంచి బయటకు తీయించారు.
మురికి కాలువలో పడి గుర్తుతెలియని మహిళ మృతి - గుర్తుతెలియని మహిళ మృతి
మురికి కాలువలో పడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో... ఆచూకీ తెలిసిన వాళ్లు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
మురికి కాలువలో పడి గుర్తుతెలియని మహిళ మృతి
పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానితులు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. మహిళ వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:చెరువులోపడి తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతి