తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని మృతదేహం - కామారెడ్డి వార్తలు

పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఘటన ఎల్లారెడ్డి డివిజన్​ కేంద్రంలో చోటు చేసుకుంది.

unidentified-dead-body-found-in-yellareddy-in-kamareddy
పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో.. గుర్తుతెలియని మృతదేహం

By

Published : Nov 17, 2020, 2:17 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని చర్చి కాంపౌండ్ వెనుక భాగంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉంది. సుమారు నెలరోజుల ముందే మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.

ఘటనాస్థలంలో దొరికిన పర్సులో ఓ చిన్నబాబు, 10ఏళ్ల బాలిక ఫోటోలు లభించాయి. వివరాలు తెలిసిన వారు వెంటనే ఎల్లారెడ్డి పోలీస్​స్టేషన్​లో సంప్రందించాల్సిందిగా ఎస్సై శ్వేత తెలిపారు.

ఇదీ చూడండి:మహిళ కాళ్లు, చేతులు చెట్టుకు కట్టి.. ఉరివేసి హత్య

ABOUT THE AUTHOR

...view details