కరోనాతో భర్త మృతి.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య - హైదరాబాద్‌లో కరోనాతో వ్యక్తి మృతి
ఎమ్మెల్సీ రవీంద్రబాబుపై హైకోర్టు సీజేకు న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కోర్టును, జడ్జిలను ఉద్దేశించి రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై దాడి చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ప్రణాళికాబద్ధంగా కోర్టులను విమర్శిస్తున్నారని లేఖలో వివరించారు. కోర్టుల ప్రతిష్ఠ దెబ్బతీసే లక్ష్యంతో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ లేఖలో కోరారు.
20:32 August 07
కరోనాతో భర్త మృతి.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య
కరోనాతో భర్త మృతి చెందడంతో... ఆ బాధను జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగైన పవన్ కుమార్‌కు 8 రోజుల క్రితం కరోనా సోకింది. ఆ తర్వాత తన తండ్రి విజయ్ కుమార్‌కు కరోనా సోకింది. ఇద్దరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 6న విజయ్ కుమార్ మృతి చెందాడు.
భర్త కరోనాతో మృతి చెందడం... కుమారుడికి కరోనా సోకడంతో మనోవేదనకు గురైన నర్మద... ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పవన్ కుమార్ మరోసారి కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి తిరిగొచ్చే సరికి తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.