మందుబాబులు.. గంజాయి తాగే వారి ఆగడాలు రోజురోజుకూ శృతి మించిపోతున్నాయి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట హరిజన బస్తీలో కొందరు గంజాయి తాగి వీరంగం సృష్టిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించినందుకు వారిపై దాడులకు పాల్పడుతున్నారు. నిన్న హరిజన బస్తీలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడికి పాల్పడినట్లు తెలిపారు.
గంజాయి మత్తులో వీరంగం.. మహిళపై దాడి - గంజాయి మత్తులో వీరంగం
లాక్‌డౌన్‌లో కూడా గంజాయి తాగుతూ.. మత్తులో ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా అల్వాల్ పీఎస్ పరిథిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన హస్మత్‌పేట హరిజన బస్తీ అల్వాల్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్లు సరిహద్దులో ఉన్నందున.. పోలీసులు పర్యవేక్షణ సరిగా లేదనే విమర్శలు కూడా వెల్లవెత్తుతున్నాయి.
మహిళపై దాడి
హరిజన బస్తీ అల్వాల్ బోయిన్‌పల్లి పీఎస్ సరిహద్దుల్లో ఉన్నందున పోలీసులు పర్యవేక్షణ సరిగా లేదని విమర్శిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి జరిగిన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ నిబంధనల ఉల్లం'ఘను'లకు విధించే శిక్షలివే..