మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మంజీరా పరివాహక ప్రాంతమైన గాజులగూడెం గ్రామ శివారులోని రాళ్ల పొదల్లో కుళ్లిపోయిన మహిళా మృతదేహం చిక్కుకుని ఉండడాన్ని పశువుల కాపరి గమనించాడు. గ్రామస్థులకు తెలియజేయగా... వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం - గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మంజీరా పరివాహక ప్రాంతమైన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెంలో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళా మృతదేహం లభ్యమైంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మృతదేహం వరద నీటిలో కొట్టుకొవచ్చి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
![కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9386704-20-9386704-1604200340139.jpg)
కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మృతదేహం వరద నీటిలో కొట్టుకొచ్చిందని వెల్లడించారు. మృతురాలి వయసు 25 ఏళ్లు ఉంటుందని... పది రోజుల క్రితం మరణించి ఉండవచ్చునని శవ పంచనామా చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.