ఓటుకు నోటు కేసులో ఉదయ్‌సింహకు 22 వరకు రిమాండ్ - hyderabad crime news
![ఓటుకు నోటు కేసులో ఉదయ్‌సింహకు 22 వరకు రిమాండ్ UDAY SIMHA ARRESTED BY ACB](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9902829-401-9902829-1608131137739.jpg)
20:01 December 16
ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహ అరెస్టు
ఓటుకు నోటు కేసులో నిందితుడు ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న విచారణకు హాజరు కాకపోవటం వల్ల అనిశా న్యాయస్థానం ఉదయ్‌సింహపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఉదయ్‌సింహపై వారెంట్ రద్దు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఉదయ్‌సింహ అభ్యర్ధనపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. అనిశా అధికారులు రాత్రి పూట ఉదయ్‌సింహను అదుపులోకి తీసుకొని అనిశా న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా... కోర్టు ఆయనకు ఈ నెల 22 వరకు అనిశా కోర్టు రిమాండ్ విధించింది.
ఇవీచూడండి:ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం