సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్లపట్ల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, స్కూటీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీ కొట్టి ఇద్దరు మృతి - సంగారెడ్డి నేర వార్తలు
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జిల్లాలోని వట్‌పల్లి మండలం నిర్జపుల గ్రామానికి చెందిన కుమ్మరి పాపయ్య, రేగోడు మండలం జగిర్యాల గ్రామానికి చెందిన హరీష్‌లు జోగిపేట నుంచి స్కూటీపై స్వగ్రామానికి బయలుదేరారు. పల్లపట్ల గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న ఈ ఇద్దరి యువకుల కాళ్లుచేతులు విరిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:'తాగుబోతు భర్తకు నడి వీధిలో తకిట తధిమి'