సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వజినేపల్లి ఘాట్ వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లి నరేందర్, వేణుగోపాల్ అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
హైదరాబాద్‌కు చెందిన నరేందర్, ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్‌లు వజినేపల్లిలోని తమ బంధువుల ఇళ్లకొచ్చారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మరో నలుగురితో కలిసి కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నరేందర్ నదిలో మునిగిపోగా.. అతడిని కాపాడే ప్రయత్నంలో వేణుగోపాల్ నదిలో కొట్టుకుపోయాడు.