తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కోనేరులో మునిగి ఇద్దరు యవకులు మృతి - chandragiri news

ఏపీలో చంద్రగిరి కోటలోని దుర్గం గుట్టపై ఉన్న పుష్కరిణిలో నీటమునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

two-young-men-were-died-in-a-pool-at-chandragiri
కోనేరులో మునిగి ఇద్దరు యవకులు మృతి

By

Published : Oct 11, 2020, 7:00 PM IST


ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి కోటపైకి ట్రెక్కింగ్​కు శనివారం మధ్యాహ్నం వెళ్లిన యువకులు దుర్గం కోనేరులో గల్లంతయ్యారు. ఈత కొట్టేందుకు ముగ్గురు యువకులు పుష్కరిణిలో దిగారు. వీరిలో శ్రీ రంగన్(27), అనుదీప్(23) గల్లంతవ్వగా.... మరో యువకుడు నితిన్(17) కోనేరు నుంచి బయటపడి క్షేమంగా ఇంటికి చేరాడు. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పగా.. వారు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చంద్రగిరి ఎస్సై రామకృష్ణ సిబ్బందితో కోటపై ఉన్న దుర్గం కోనేరుకు చేరుకొని వారు మృతిచెందినట్లు నిర్దారించారు. నీటిపై తెలుతున్న మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీసి.... పోస్టుమార్థం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు తిరుపతి నగరంలోని ఖాదీ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు.

ఇవీ చూడండి: లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details