చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు.. ఒక మృతదేహం లభ్యం - ఇద్దరు యువకులు గల్లంతు
07:31 October 04
చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు.. ఒక మృతదేహం లభ్యం
రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పరిధిలోని జల్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి జల్‌పల్లి చెరువులో గల్లంతైన యువకున్ని బయటకు తీసేందుకు దిగిన మరో యువకుడు కూడా మునిగి చనిపోయాడు. పాతబస్తీ రైన్ బజార్‌కు చెందిన సోహైల్ అనే యువకుడు... పాత పుస్తకాలు చెరువులో వేయడానికి రాత్రి వచ్చి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడ్డాడు.
సోహైల్‌ను బయటకు తీసేందుకు ఇవాళ ఉదయం చెరువులోకి దిగి మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి... ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మరో యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. వనస్థలిపురం ఏసీపీ ఎం అశోక్, కందుకూరు ఆర్డీవో, బాలాపూర్ ఎమ్మార్వో, జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఇదీ చూడండి:కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి