తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కొండగట్టు ప్రమాదానికి రెండేళ్లు... ఇప్పటికీ కోలుకోని బాధితులు

ఆ ఘటనను తలచకుంటే వారి గుండె భయంతో వణికి పోతుంది. గాయపడిన వారు ఇంకా కోలుకోలేదు. అయిన వారిని కోల్పోయిన వాళ్లు బాధను మరిచిపోలేదు. ఇంతటి శోకాన్ని మిగిల్చిన కొండగట్టు ప్రమాదానికి నేటికి రెండేళ్లు.

two-years-for-kondagattu-bus-accident-and-55-people-died-in-kondagattu-accident
కొండగట్టు ప్రమాదానికి రెండేళ్లు... ఇప్పటికీ కోలుకోని బాధితులు

By

Published : Sep 11, 2020, 12:30 PM IST

ఆ భయానక క్షణం ఇంకా వారిమదిలో మెదులుతోంది. కన్నవారిని.. ఆత్మీయులను.. దూరం చేసుకుని రెండేళ్లు గడిచినా... కన్నీళ్లు ఆరడం లేదు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగి... నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 65మందిని పొట్టన పెట్టుకున్న ఆ ఘటన దృశ్యాలు... ఇప్పటికీ వారి మదిలో మెదులుతూనే ఉన్నాయి.

వారంతా నిరుపేదలే...

సరిగ్గా ఇదే రోజు ఉదయం 11 గంటలకు కొండగట్టు ఘాటు రోడ్డు వద్ద.. బస్సు బ్రేకులు పనిచేయక అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 65 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 50 మంది గాయాలపాలయ్యారు. మృతులంతా నిరుపేదలే.. కాయ కష్టం చేసుకునే వారే. వీరిలో కొందరు మంచానికే పరిమితమయ్యారు.

ఆర్టీసీ నిర్లక్ష్యమే..

ప్రమాదానికి కారణం ఆర్టీసీ నిర్లక్ష్యమేనని విచారణలో తేలింది. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ 3లక్షలు, ప్రభుత్వం 5లక్షల రూపాయలు పరిహారం ఇచ్చింది. కానీ ఎంత పరిహారం ఇచ్చినా... జీవితకాలపు విషాదాన్ని మిగిల్చిన ప్రమాదం నుంచి... బాధిత కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి.

ఇదీ చూడండి:కారు నేర్చుకుంటూ.. కానరాని లోకాలకు..

ABOUT THE AUTHOR

...view details