తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు మట్టిదిబ్బలు కూలి ఇద్దరు మహిళలు మృతి - మట్టిదిబ్బలు కూలి ఇద్దరు మహిళలు మృతి

మట్టిదిబ్బలు కూలి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా తొండంగిలో చోటుచేసుకుంది. మాంగనీస్ వ్యర్థాల డంపింగ్ యార్డులో మాంగనీస్ వెతుకులాట కోసం వెళ్లి మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

dead
dead

By

Published : Dec 19, 2020, 10:40 PM IST

ఏపీ విజయనగరం జిల్లా గరివిడి మండలం తొండంగిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మట్టిదిబ్బలు కూలి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మీ, సూరీడమ్మాలు మాంగనీస్ వ్యర్థాల డంపింగ్ యార్డులో మాంగనీస్ వెతుకులాట కోసం వెళ్లారు. ఆ సమయంలో మట్టిదిబ్బలు కూలటంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న గరివిడి పోలీసులు మట్టిలో కూరుకుపోయిన వారిని వారిని వెలికి తీశారు. వారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రమాదవశాత్తు మట్టిదిబ్బలు కూలి ఇద్దరు మహిళలు మృతి

ఇదీ చదవండి:సచివాలయ పనులు వేగవంతం.. భారీ చెట్ల తొలగింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details