తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆగి ఉన్న ట్రాక్టర్​ను డీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి - వంగపల్లి శివారులో రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

two women died in accident on warangal hyderabad national highway
ఆగి ఉన్న ట్రాక్టర్​ను డీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి

By

Published : Aug 30, 2020, 7:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గరలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు పనుల కోసం ఆగి ఉన్న ట్రాక్టర్​ను... వరంగల్ వైపు వెళ్తున్న టీఎస్​ 07 యూ జీ 8638 నెంబర్ గల లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు, బాధితులను భువనగిరి ప్రాంతీయ ఆసుపత్రికి తలించారు. ఈ ఘనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details