తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సభలో అపశ్రుతి.. కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు మృతి - Two women dead in ycp meeting

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా రేలంగిలో ఇళ్ల పట్టాల పంపిణీలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు.

two-women-dead-in-west-godawari-ycp-meeting
సభలో అపశ్రుతి..కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు మహిళలు మృతి

By

Published : Jan 9, 2021, 7:52 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగిలో.. ఇళ్ల పట్టాల పంపిణీలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి.

సభలో అపశ్రుతి..కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు మహిళలు మృతి

ఏం జరిగిందంటే..

తణుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. సభ జరుగుతున్న సమయంలో మహిళలు కూర్చున్న ప్రాంతంలో ప్రమాదవశాత్తు కొబ్బరి చెట్టు కూలింది. చెట్టు కింద ఇరుక్కుపోయిన ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. దుర్గా భవాని, శాంతా అనే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: ఏమై ఉంటుంది?: రైల్వే ట్రాక్​పై అన్నదమ్ముల మృత్యువాత

ABOUT THE AUTHOR

...view details