వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి సమీపంలో హైదరాబాద్-కర్నూల్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొంది. ఒకరిపై నుంచి వాహనం వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జుగా మారింది. పక్కనే ఉన్న మహిళ భయంతో పరుగులు తీయగా... అటుగా వస్తున్న మరో వాహనం ఆమెను ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.
వనపర్తి జిల్లాలో ఇద్దరు మహిళలు దుర్మరణం - వనపర్తి లేటెస్ట్ అప్డేట్స్
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న క్రమంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఒకరిపై నుంచి వాహనం వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయింది.
వనపర్తి జిల్లాలో ఇద్దరు మహిళలు దుర్మరణం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష కోసం వనపర్తి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మహిళల వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:నిలిపి ఉంచిన బస్సులో అగ్ని ప్రమాదం
Last Updated : Dec 22, 2020, 9:58 AM IST