జగిత్యాలలోని పురాణిపేటలో సోమవారం రాత్రి పిడుగు పడి ఆంజనేయులు అనే మెకానిక్ చెందిన స్కూటీ కాలిపోయింది. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో భారీ శబ్దంతో కూడిన పిడుగు పడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పిడుగు పడి ద్విచక్ర వాహనం దగ్ధం - etv bharath
పిడుగు పడి ద్విచక్ర వాహనం దగ్ధమైన ఘటన జగిత్యాలలో జరిగింది. పిడుగు పడే సమయంలో భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పిడుగు పడి ద్విచక్ర వాహనం దగ్ధం
ద్విచక్ర వాహనం కాలిపోవడం వల్ల రూ.50 వేల నష్టం వచ్చిందని మెకానిక్ ఆంజనేయులు తెలిపారు.
ఇదీ చదవండి:షీటీం పోలీసులమని చెప్పి మోసం చేసిన వ్యక్తుల అరెస్ట్