నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కుంటాల మండలం సూర్యాపూర్ గ్రామానికి చెందిన శీలా సాయినాథ్, మిత్రుడు రొడ్డ సాయినాథ్తో కలిసి ద్విచక్రవాహనంపై అడెల్లి పోచమ్మదేవి ఆలయానికి వెళ్లారు.
దైవదర్శనానికి వెళ్లి వస్తూ...తిరిగిరాని లోకాలకు - దైవదర్శనానికి వెళ్లి వస్తూ మృతి
ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలకేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
దైవదర్శనానికి వెళ్లి వస్తూ...తిరిగిరాని లోకాలకు
అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో శీలా సాయినాథ్(27) అక్కడికక్కడే మరణించాడు. వెనుక కూర్చున్న రొడ్డ సాయినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతుగాత్రున్ని 108 వాహనంలో నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతనికి భార్య, కూతురు ఉన్నట్లు తెలిపారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.