కనకవర్షం కురిపించే పసరు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా..? మీకు కూర్చున్న చోటనే డబ్బుల వర్షం కురిపిస్తే చూడాలని ఉందా..? మీ కలలను మేము నిజం చేస్తామంటూ... అంటూ ప్రజలను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పసరు పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు - నల్గొండలో మోసగాళ్ల అరెస్టు
కనక వర్షం కురిపించే పసరు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్బీసీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా... అదుపులోకి తీసుకున్నారు.
![పసరు పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు two town twotwo town police arrest cheaters in nalgonda town police cheaters arrest in nalgondapolice cheaters arrest nalgonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9641437-201-9641437-1606150058560.jpg)
పసరు పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు
నల్గొండ జిల్లా కేంద్రం ఎస్ఎల్బీసీ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా... పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. హైద్రాబాద్, నల్గొండ, మేడ్చల్ జిల్లాలకు చెందినవారిగా విచారణలో తేలింది. వీరి నుంచి రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వన్ టౌన్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి:ఒక్కటే బాకీ ఉంది... అది కూడా నెరవేరుస్తా: కేటీఆర్