యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో జరిగింది. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను తెరవడానికి ప్రయత్నించిన దొంగలు ఎంతకీ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు.
ఏటీఎం చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు - సంగారెడ్డి జిల్లాలో ఏటీఎం చోరీకి విఫల యత్నం
సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలో దొంగలు చెలరేగిపోయారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
![ఏటీఎం చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు two-thiefs-attempted-atm-theft-in-sangareddy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10361715-111-10361715-1611481617175.jpg)
ఏటీఎం చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు
ఏటీఎంను గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు దొంగలు ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్థానికంగా అలికిడి వినిపించడంతో చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లి పోయారు. ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:కష్టాన్నే ఇష్టపడింది... దేశంలోనే కీర్తి గడించింది!
Last Updated : Jan 24, 2021, 4:56 PM IST