రెక్కీ నిర్వహించి పట్టపగలే ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో వాహన తనిఖీలు చేస్తుండగా... ఓ ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా పారిపోతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా... అసలు విషయం బయటపడింది. శ్రీను (25), పరుశురాం (28) ఇద్దరిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పీఎస్‌లలో కేసులు ఉన్నాయని గుర్తించారు.
పట్టపగలే ఇళ్లు దోచేస్తున్న ఇద్దరు దొంగలు అరెస్ట్ - two thefts arrested in hyderabad
మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో పట్టపగలే ఇళ్లలో చోరీలు చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.12లక్షల విలువైన 21 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం, సిలిండర్, టీవీ, చరవాణీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పలుమార్లు జైలుపాలైన వీళ్లు... విడుదలైన తరువాత కూడా జగద్గిరిగుట్టలో పలు చోరీలకు పాల్పడ్డట్లు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. నిందితుల నుంచి 21 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం, సిలిండర్, టీవీ, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.12.25 లక్షలుగా పోలీసులు తెలిపారు. ఇద్దరిని రిమాండ్‌కు పంపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఎవరైనా సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తే ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకూడదని తెలిపారు. ఊరేళ్ళేవారు పోలీసులకు పిర్యాదు చేస్తే ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు.