తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇసుక ట్రాక్టర్​ అడ్డుకున్నారంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ - illegal transport of sand leads to fight at nagar kurnool district

నాగర్​కర్నూలు జిల్లా చారకొండ మండలకేంద్రంలో ప్రభుత్వం చెత్తను తరలించేందుకు ఇచ్చిన ట్రాక్టర్​ను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నారంటూ గ్రామానికి చెందిన యువకులు వారిని అడ్డుకున్నారు. ఈ మేరకు స్థానిక సర్పంచ్​ వర్గంలోని కొందరు.. ఇసుక ట్రాక్టర్​ అడ్డుకున్న యువకులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని.. వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని గ్రామస్థులు తెలిపారు.

two teams fight because of illegal transport of sand
ఇసుక ట్రాక్టర్​ అడ్డుకున్నారంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ

By

Published : Sep 3, 2020, 10:55 PM IST

నాగర్​కర్నూలు జిల్లా చారగొండ మండలకేంద్రంలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ రసాభాసగా మారింది. ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉన్న తెరాస నేతలు కొందరు చెత్తను సేకరించడానికి ఇచ్చిన ట్రాక్టర్​ను అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామానికి చెందిన కొందరు భాజపా యువకులు ఆరోపించారు. ఈ మేరకు వారిపై అధికార పార్టీ కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ.. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఇసుక ట్రాక్టర్​ అడ్డుకున్నారంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ

అభివృద్ధి పనుల కోసం ఇసుక తరలింపునకు ప్రభుత్వ అనుమతినివ్వగా.. ప్రజాప్రతినిధులైన కొందరు.. సర్పంచ్​ అనుమతి ఉన్న పత్రాలను చూపిస్తూ అక్రమంగా ఇసుక తరలింపు ప్రక్రియను చేపడుతున్నారనే ఆరోపణలు ఇరువర్గాల మధ్య వివాదానికి దారితీసింది. దీనివల్ల గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న కల్వకుర్తి ఆర్డీవో రాజేష్​కుమార్, చారకొండ ఎస్సై కృష్ణదేవ.. ఇరువర్గాలను శాంతింపచేయగా పరిస్థితి సద్దుమణిగింది.

ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details