తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తల్లితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు - తెలంగాణ వార్తలు

తల్లితో గొడవపడి అక్కాచెల్లెళ్లు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. బాలికలు అదృశ్యం కావటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, ఫోన్​ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

missing
missing

By

Published : Jan 12, 2021, 3:57 PM IST

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. సామ కృష్ణశ్రీ, సామ వైష్ణవి అనే అక్కాచెల్లెళ్లు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. కృష్ణశ్రీ పదో తరగతి, వైష్ణవి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. బాలికలు అదృశ్యం కావటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

తల్లితో గొడవ పడినట్లు బాలికల తాతయ్య రాజయ్య తెలిపాడు. బాలికలు సాయంత్రం 4గంటలకు ఫోన్‌ చేసి... సమీప గ్రామంలోని తమ స్నేహితురాలి ఇంటికి చదువుకోవడానికి వెళ్లామని చెప్పినట్లు రాజయ్య పేర్కొన్నాడు.

బాలికల తల్లిదండ్రులు జమ్మికుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ఫోన్​ సిగ్నల్స్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిన అక్కచెల్లెళ్లు

ఇదీ చదవండి :విద్యాసంస్థలు తెరిచేలా మార్గదర్శకాలు రూపొందించాలి: సబిత

ABOUT THE AUTHOR

...view details