తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 10:21 PM IST

ETV Bharat / jagte-raho

దిగంబరంగా ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనం.. అరెస్టు

దిగంబరంగా ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తితో పాటు అతడికి సహాయం చేస్తున్న మరొకరిని ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

two-robbers-arrested-by ap vishaka-police
దిగంబరంగా ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనం.. అరెస్టు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి దిగంబరంగా ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి, అతడికి సహయం చేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని శాంతి భద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. గుంటూరుకు చెందిన కంచర్ల మోహనరావుపై గతంలో 60కి పైగా కేసులున్నాయని.. ఇతను గతంలో అనేకసార్లు శిక్ష అనుభవించి బయటకు వచ్చినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీలో ఉన్న ఆధారాలను బట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడని డీసీపీ వివరించారు.

ఈ కేసులో అనకాపల్లికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్​ చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు మోహన్​రావుకు 4 నెలల క్రితం పరిచయం అయ్యాడని...ఇద్దరూ కలిసి ఉదయం వేళల్లో రెక్కీ నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడేవారని వెల్లడించారు. పథకం ప్రకారం చోరీకి వెళ్లేముందు మోహనరావు బట్టలన్నీ విప్పేసి ఒక్కడే వెళ్తుంటాడని...ఒకవేళ పట్టుబడితే మానసిక రోగిగా నటిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని చెప్పారు. అలా దోచుకున్న సొత్తును రెండో నిందితుడు సంతోష్​ కుమార్ అమ్మి సొమ్ము చేస్తాడని పేర్కొన్నారు. ఇద్దరి వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని... మరికొంత సొమ్ము రికవరీ చేయాల్సి ఉందని వివరించారు.

ఇదీ చదవండి :ప్రకృతిని ప్రేమించిన మట్టిమనిషి విజయరామ్

ABOUT THE AUTHOR

...view details