తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయం.. ఆర్​ఎంపీలు అరెస్టు - ఆర్​ఎంపీ వైద్యులు అరెస్టు వార్తలు భద్రాద్రి జిల్లా

నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్న ఇద్దరు ఆర్​ఎంపీ వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు కేసులు నమోదు చేశామన్నారు. పక్కా సమాచారంతో వారి క్లినిక్​పై దాడి చేసినట్లు ఔషధ అధికారి బాలకృష్ణ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయం.. ఆర్​ఎంపీలు అరెస్టు
నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయం.. ఆర్​ఎంపీలు అరెస్టు

By

Published : Nov 20, 2020, 8:51 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధి సుభాష్​ నగర్​లోని ఓ ఆర్​ఎంపీ క్లినిక్​పై డ్రగ్​ ఇన్​స్పెక్టర్​ దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. లక్ష ఉంటుందని ఇన్​స్పెక్టర్​ బాలకృష్ణ తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయం.. ఆర్​ఎంపీలు అరెస్టు

గ్రామీణ వైద్యులుగా పనిచేస్తూ.. మందులు కూడా విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఇద్దరు ఆర్​ఎంపీ వైద్యులను అరెస్టు చేసి.. వారిపై 18 సీ డ్రగ్స్​ అండ్​ కాస్మెటిక్​ చట్టం 19, 40 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఖమ్మం రూరల్​ ఎస్సై సోమేశ్వర్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:డేటింగ్​ యాప్​లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details