రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసరగుట్టలో పోలీసులు జన్మదిన వేడుకలు నిర్వహించిన నేపథ్యంలో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది.
బర్త్ డే కానిస్టేబుల్ సస్పెండ్..
పుట్టినరోజు చేసుకున్న కానిస్టేబుల్ శివకుమార్ సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు రాచకొండ సీపీ మహేష్ భగవాత్ ఛార్జ్ మెమో జారీ చేశారు. పర్యవేక్షణ లోపం కారణంగా కీసర సీఐకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఉన్నతాధికారుల ఆదేశాలు..
గతంలో వనస్థలిపురంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న సందర్భంలో చాలా మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు, సిబ్బంది వేడుకల్లో పోలీసులెవరూ పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేశారు.
అందువల్ల ఇద్దరికి కరోనా..
బుధవారం రాత్రి కీసరగుట్టలోని టూరిజం గెస్ట్ హౌస్లో కానిస్టేబుల్ శివకుమార్ తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు కానిస్టేబుల్ షనూర్ బాబు, నవీన్, మరికొంత మంది బయటి వ్యక్తులతో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఫలితంగా ఇద్దరు పోలీసులకు కరోనా సోకడం వల్ల విచారణ చేసి వారిపై చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించవద్దని కమిషనరేట్ పరిధిలోని అన్ని స్థాయిల పోలీసులకు సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : బెడిసికొట్టిన రిపోర్టర్ డీలింగ్... ట్రాప్లో పడి కిడ్నాప్