ఇద్దరి దారుణహత్య: బండరాళ్లతో మోది కిరాతకంగా చంపేశారు! - telangana crime news
08:58 January 25
బండరాళ్లతో మోది.. ఇద్దరు వ్యక్తుల హత్య
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఏ బేగ్ ఫంక్షన్ వెనకాల గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభించాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బండరాళ్లతో మోది ఆ ఇద్దర్ని హత్య చేసినట్లు గుర్తించారు. వారి పక్కనే మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
మృతుల వయస్సు 28-30 మధ్య ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వీరు వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య అర్ధరాత్రి సమయంలో జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి :అమందా కవిత.. అక్కడ మారుమోగింది!