తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వ్యాపారంలో నష్టం... వ్యక్తి ఆత్మహత్య - కామారెడ్డిలో వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. కామారెడ్డి పట్టణానికి చెందిన శ్యామ్​ కుమార్​ వ్యాపారంలో నష్టాన్ని చవి చూసి మనస్తాపంతో చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ఘటనలో పెద్ద చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

two-persons-suicide-in-kamareddy-district
వ్యాపారంలో నష్టం... వ్యక్తి ఆత్మహత్య

By

Published : Oct 9, 2020, 8:04 PM IST

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యాపారంలో నష్టాన్ని భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో పడి పట్టణానికి చెందిన చిల శ్యామ్ కుమార్ మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్యామ్ కుమార్ సొంత వ్యాపారం మొదలు పెట్టి, నష్టాల బారిన పడి.. తీవ్ర మనస్తాపానికి గురై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

గుర్తు తెలియని మహిళ మృతదేహం

మరో ఘటనలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మహిళ వయస్సు సుమారు 45 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:యూట్యూబ్​లో చూసి నేర్చుకుని లక్షలు వసూలు చేశారు...!!

ABOUT THE AUTHOR

...view details