సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తాళలేక కోనాయిపల్లి గ్రామానికి చెందిన శివోల్లా స్వామి, కుటుంబ కలహాలతో సూరంపల్లి గ్రామానికి చెందిన రాజాగౌడ్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
కోనాయిపల్లికి చెందిన శివోల్ల స్వామి తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవలే కూతురు వివాహం జరిపించాడు. ఈ క్రమంలో పంట కోసం, కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు పెరిగిపోవటం వల్ల మనస్తాపం చెందిన స్వామి.. గురువారం సాయంత్రం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలానికి వెళ్లిన స్వామి రాత్రయినా ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు గ్రామంలో విచారించగా ఫలితం లేకపోయింది.
శుక్రవారం పొలం వద్ద చెట్టుకు వేలాడుతున్న స్వామిని గుర్తించిన చుట్టుపక్కల రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.