వివాహవేడుకకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లు సమీపంలోని బుగ్గవాగు వద్ద బైకు అదుపుతప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు.
శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంతలోకాలకు.. - ఖమ్మం జిల్లాలో చెట్టును ఢీకొన్న బైక్
ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా... వారు ప్రయాణిస్తున్న బైక్ రహదారి పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పొన్నెకల్లు సమీపంలోని బుగ్గవాగు వద్ద చోటు చేసుకుంది.
శుభాకార్యానికి వెళ్లి వస్తూ... సుదూర లోకాలకు
మృతులు పండితాపురం గ్రామానికి చెందిన అరిపిన్ని వెంకటేశ్(23), కానుగల సాయి(22)గా పోలీసులు గుర్తించారు. మహబూబాబాద్‌లోని శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. నూతన ఏడాది మొదటి రోజే ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.