రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు... హైదరాబాద్ పాతబస్తీలో నివాసం ఉంటున్న ఆ కుటుంబాన్ని విషాదంతో నింపేశాయి. హజీమహ్మద్ సుమారు 80 ఏళ్లుగా... కుటుంబంతో హుస్సేని ఆలంలో నివాసముంటున్నారు. రేకుల ఇల్లు పాతది కావడంతో....వర్షాలకు గోడలు పూర్తిగా నానిపోయి... ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో కూతురితో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.
త్వరలోనే పెళ్లి... అంతలోనే మృత్యు ఒడికి వధువు - పాతబస్తీలో కూలిన ఇల్లు
ఆ ఇంట్లో వారం రోజుల్లో శుభకార్యం జరగాల్సి ఉంది. అంగరంగ వైభవంగా కూతురి పెళ్లి చేయాలని తండ్రికలలు కన్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని అత్తారింటికి పంపుదామనుకున్నాడు. కానీ...కళ్ల ఎదుటే గోడకిందపడి చనిపోవడంతో ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది.
త్వరలోనే పెళ్లి... అంతలోనే మృత్యు ఒడికి చేరిన వధువు
స్థానికులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా... కోడలు ఫిరాబేగం, కూతురు అనీజ్ బేగం ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన కుటుంబ సభ్యులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది భవనాన్ని కూల్చివేశారు.
ఇదీ చూడండి:రాజీవ్ రహదారిపై కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి