తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జాతీయ రహదారిపై రెండు వాహనాలను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి - ఆకివీడు వద్ద రోడ్డు ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొని... ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా... ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

two-persons-died-and-three-members-injured-in-accident-at-akividu-in-west-godavari-district
జాతీయ రహదారిపై రెండు వాహనాలను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

By

Published : Dec 14, 2020, 8:44 AM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విజయవాడ నుంచి వీరవాసరం వెళ్తున్న ఓ కారు ఆకివీడు రైస్​ మిల్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొని ఎదురుగా వస్తున్న టాటా ఏస్​ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్​లో ప్రయాణిస్తున్న పది మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మిగతా ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నందున భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరికి ఆకివీడులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ట్రాఫిక్ అంతరాయం..

ఘటనా స్థలానికి చేరుకున్న ఆకివీడు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ఏర్పడిన ట్రాఫిక్​ అంతరాయాన్ని తొలగించారు. ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న వాళ్లంతా వీరవాసరం మండలం వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ... విధి వక్రీకరించింది

ABOUT THE AUTHOR

...view details