రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడ గేట్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. తండ్రీ కొడుకుల మృతి - రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగార్జునసాగర్ రోడ్డుపై తమ్మలోనిగూడ గేట్ సమీపంలో ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో తండ్రికుమారులు మృతి....ఒకరికి గాయాలు
యాచారం మండలం నానక్‌నగర్ గ్రామానికి చెందిన తండ్రికుమారులు తాండ్ర జంగయ్య(55), తాండ్ర రమేశ్(30) మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.