నిజామాబాద్ జిల్లా మోపాల్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన దగ్గరి బంధువులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మోపాల్కు చెందిన వరుసకు మామాకోడళ్లు అయ్యే గోసంగి స్వప్న, చిన్న సాయిలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆత్మహత్యాయత్నం చేయగా.. నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
పురుగుల మందు తాగి మామాకోడళ్లు ఆత్మహత్య
పురుగుల మందు తాగి ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి దగ్గరి బంధువులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్లో చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం బయటపడటం వల్ల పరువు పోతుందని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పురుగుల మందు తాగి మామకోడళ్లు ఆత్మహత్య
చికిత్స పొందుతూ సోమవారం రాత్రి స్వప్న(30), మంగళవారం ఉదయం చిన్న సాయిలు(45) మృతి చెందారు. స్వప్న.. చిన్న సాయిలు అన్న కోడలు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం బయటపడటం వల్ల పరువు పోతుందని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మోపాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: రైల్వే వంతెన కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం