హైదరాబాద్ బేగంపేటలోని పార్క్ అపార్ట్మెంట్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంకిత్ కుమార్, పవన్ కుమార్‌ను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షా 20 వేల నగదు, రెండు సెల్ ఫోన్స్, ఒక ఐపాడ్ స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్షా 20 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
అంకిత్ బేగంపేటలో, పవన్ కుమార్ సుల్తాన్ బజార్లో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకునే వారిని పోలీసులు తెలిపారు. వారు ఆన్లైన్లో అనేక మందిని బెట్టింగ్ వైపు ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిపే వారని తెలిపారు. నిందితులను విచారణ నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి:విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వు