గోవా నుంచి హైదరాబాద్కు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 200 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పబ్లకు మత్తు పదార్థాల సరఫరా.. ఇద్దరు అరెస్ట్ - హైదరాబాద్ తాజా సమాచారం
భాగ్యనగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. గోవా నుంచి రాజధానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 200 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు.
రాజధానిలో మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
ఓ పబ్లో పనిచేసే సల్మాన్, హైమద్ అనే ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాలను నగరంలోని పబ్లకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు వ్యభిచారం ముసుగులో మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.