హైదరాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సికింద్రాబాద్ సింధీ కాలనీకి చెందిన భవేశ్, రాహుల్ ఇద్దరు కలిసి... భవేశ్ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఉత్తరం మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. వాళ్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.40 వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వృత్తిరీత్యా భవేశ్ రెస్టారెంట్ యజమానిగా, రాహుల్.. బేకరీలో వస్తువులు తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేసేవారు. నకిలీ యాప్ ద్వారా కొత్తగా సభ్యులను చేర్చుకుని వారితో జూదం ఆడించే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ ఆటలో గెలిచిన వారు ఏజెంట్‌గా ఉన్నవారికి కమీషన్ రూపంలో డబ్బులు చెల్లించే వారు. సులువుగా డబ్బు వస్తుదని భావించి.. ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.