నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నకార్పాముల వాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి వాగు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి వాగు ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు కొల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వాగు దాటుతుండగా కాలుజారి ఇద్దరు యువకుల గల్లంతు - నాగర్ కర్నూల్ తాజా వార్తలు
వాగులో ఇద్దరు యువకులు గల్లంతైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది . గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయినట్టు స్థానికులు తెలిపారు.
వాగు దాటుతుండగా కాలు జారి.. ఇద్దరు యువకులు గల్లంతు
వాగులు కొట్టుకుపోయిన ఇద్దరిని కాపాడేందుకు అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి జాడ దొరకలేదని అధికారులు తెలిపారు. వీలైనంత వరకు ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: చెట్టు కొమ్మలు కొట్టబోయి నాలాలో పడిన యువకుడు