గత కొద్దిరోజులుగా రంగారెడ్డి జిల్లా కేశంపేటలో జోరుగా వర్షాలు కురుస్తున్నందున చెరువు అలుగుపారి ప్రవహిస్తోంది. మంగళవారం ఈ చెరువులో చేపలు పట్టుకుందామని తలకొండపల్లి మండలం వెంకటరావుపేట తండాకు చెందిన ఇద్దరు.. ప్రమాదకరమని తెలిసినా వెళ్లారు.
చేపలకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి - tommiderukula river latest news
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరెకుల గ్రామసమీపంలోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ఓ యువకుడు, బాలుడు మృత్యవాతపడ్డారు. ఈ విషాదం మంగళవారం చోటుచేసుకుంది. ప్రమాదమని తెలిసినా వారు అక్కడికి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.
బలి కోరిన చేపల చెరువు.. చెరువులో పడి ఇద్దరు మృతి
చేపలు పట్టే ప్రయత్నంలో వారిద్దరూ జారి చెరువులో పడిపోయారు. కొట్టుకుపోతున్న వారిని చూసి.. అక్కడే ఉన్న వ్యక్తి గ్రామస్థులకు సమాచారమిచ్చారు. గ్రామస్థులకు కొద్ది దూరంలో వారి శవాలు కనిపించాయి. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండిఃరోడ్డు ప్రమాదంలో మహిళ మృతి... మరో వ్యక్తికి తీవ్ర గాయాలు