సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి అక్కడిక్కడే మృతి చెందగా... మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. వరంగల్‌కు చెందిన రమేష్ (30), సాగర్ (30) హైదరాబాదులో ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి two people died in road accident on rajiv rahadari at kondapaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10011062-thumbnail-3x2-died.jpg)
రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
వీరిద్దరూ ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వచ్చి శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొని వాహనం కింద పడిపోయారు. అదే సమయంలో అటు నుంచి వస్తున్న లారీ వీరిపై నుంచి దూసుకెళ్లింది.
ఇదీ చూడండి:'కూలి'న బతుకులు: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం