తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'తండ్రి కోసం వెళ్లి కొడుకు.. కూతురు కోసం వెళ్లి తల్లి' మృతి - ap crime news

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల - గాజులపల్లె రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఆటో నడుపుతూ అదుపు తప్పి ఓ బాలుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనం టైర్ పంక్చర్​ అయ్యి అదుపు తప్పడం వల్ల కింద పడి మహిళ మృతి చెందింది.

రోడ్డు ప్రమాదాల్లో..'తండ్రి కోసం వెళ్లి కొడుకు.. కూతురు కోసం వెళ్లి తల్లి' మృతి
రోడ్డు ప్రమాదాల్లో..'తండ్రి కోసం వెళ్లి కొడుకు.. కూతురు కోసం వెళ్లి తల్లి' మృతి

By

Published : Dec 17, 2020, 6:13 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల - గాజులపల్లె రహదారిపై బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బోయలకుంట్ల మెట్ట వద్ద అరటి పండ్లు విక్రయిస్తున్నషరీఫ్​ తమ కుమారుడు అబ్దుల్లా(11)కు ఆటో ఇచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. అబ్దుల్లా భోజనం తీసుకువస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు.

ద్విచక్ర వాహనంపై నుంచి పడి...

ఇదే రహదారిపై నందిపల్లె వద్ద జరిగిన మరో ప్రమాదంలో గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన నారాయణమ్మ (35) మృతి చెందింది. నారాయణమ్మ, ఆమె భర్త శ్రీను, బంధువుతో కలిసి నంద్యాల సమీపంలో గురుకుల పాఠశాలలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా... ద్విచక్ర వాహనం టైరు పంక్చర్​ అయ్యింది. ఘటనలో నారాయణమ్మ కిందపడి ప్రాణాలు కోల్పోయింది.

ఇదీ చదవండి:పెళ్లి పనులు చేసేందుకొచ్చి... మృత్యు ఒడికి చేరారు

ABOUT THE AUTHOR

...view details