వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. ధర్మసాగర్ మండలం దేవునూర్‌కు చెందిన సుమన్, ముల్కనూరుకు చెందిన మాధవి.. ఎల్కతుర్తి మండలం దామెర శివారు గుట్టల్లో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులిద్దరూ దగ్గరి బంధువులు కాగా.. వరుసకు అత్తా, అల్లుడు అవుతారు. వీరికి వేరువేరుగా వివాహాలు జరిగి పిల్లలు కూడా ఉన్నారు.
వివాహేతర సంబంధం.. అత్త, అల్లుడి బలవన్మరణం - two committed suicide due to an extramarital affair news
వారిద్దరూ దగ్గరి బంధువులు. వరుసకు అత్తా, అల్లుడు. వారిద్దరి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం.. వారి కుటుంబాల్లో చిచ్చురేపింది. పచ్చని సంసారాలను పాడు చేసింది. మనస్తాపం చెందిన ఇద్దరూ చివరికి శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకుని తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది.
వివాహేతర సంబంధం.. అత్త, అల్లుడి బలవన్మరణం
వివాహేతర సంబంధం కారణంగా ఇరువురి కుటుంబాల్లో కలహాలు చోటుచేసుకోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: క్షణికావేశం మిగుల్చుతోంది.. రెండు కుటుంబాల్లో విషాదం