హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనగాంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణుమూర్తితో పాటు డబీర్పుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాపలాదారుగా పనిచేస్తున్న మహవీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైకోర్టులో ఉద్యోగాలిస్తామంటూ నిందితులు నకిలీ నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, సెక్షన్ ఇంఛార్జిల సంతకాలను ఫోర్జరీ చేశారు. అభ్యర్థులు ఎంపికైనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేసి వాళ్లకు గాంధీ ఆస్పత్రిలో మెడికల్ చెకప్ నిర్వహించారు. ఇందుకోసం హైకోర్టు అధికారి పేరు మీద నకిలీ లేఖను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.