వైద్యుల నిర్లక్ష్యంతో తమ కంటిచూపు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటన హైదరాబాద్ పంజాగుట్టలో జరిగింది. దోమలగూడకు చెందిన కళావతి కంటి సంబంధిత రుగ్మతతో హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పలు వైద్య పరీక్షలు చేసి గత నెల 30న కంటికి శస్త్ర చికిత్స చేశారు. ఆమెతో పాటు గాంధీనగర్‌కు చెందిన పద్మకు ఆపరేషన్ చేశారు. ఈ రెండు శస్త్రచికిత్సలు విఫలం కావడం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గుర్తించిన వైద్యులు వారికి మరలా పంజాగుట్టలోని తమ బ్రాంచి ఆస్పత్రిలో చికిత్స అందించారు.
ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం.. చూపు పోయిందని బాధితుల ఫిర్యాదు! - తెలంగాణ వార్తలు
ఓ ప్రైవేటు కంటి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ కంటి చూపు పోయిందని ఇద్దరు బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం సరోజిని దేవి కంటి ఆస్పత్రికి తరలించారు.
ప్రైవేటు కంటి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం.. చూపు పోయిందని బాధితుల ఫిర్యాదు
అయినప్పటికీ కంటిచూపు మెరుగుకాకపోవడం వల్ల బాధిత కుటుంబసభ్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులను మెరుగైన వైద్యం కోసం మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి పంపించారు.
ఇదీ చూడండి:దంపతుల మధ్య కరోనా గొడవ... తెల్లారే భార్య ఆత్మహత్య