ఏపీలోని గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అసభ్యంగా చిత్రించి, ఆపై అత్యాచారం చేసిన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే వరుణ్, కౌశిక్ అరెస్ట్ అయ్యారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వీరిలో ఒక యువకుడు అసభ్య చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినట్లు.. మై నేమ్ ఈజ్ 420 పేరుతో ఖాతా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖాతా నిర్వాహకుడు తనకు తెలిసిన వారికి ఆ చిత్రాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయంలో అతనికి సహకరించిన మరో విద్యార్థిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ వీడియోలు చూపించి విద్యార్థిని నుంచి డబ్బులు కూడా వసూలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.