పండగ పూట నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన హరి(26), రాజు (23) ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వైపు వెళ్తూ... ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారుకు ఢీకొన్నారు.
విషాదం: కారును ఢీకొన్న ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి - two men died in accident
శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారిపై వెల్దండ మండల కేంద్రం సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా... ప్రాణాలు వదిలాడు.
two men died in car and bike accident at veldanda
ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా... ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వద్ద లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా... కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: అమానవీయం: పసిబిడ్డను భవనంపై నుంచి పడేసి చంపేసిన తల్లి
Last Updated : Nov 15, 2020, 6:32 AM IST